కాంగ్రెస్ పార్టీతోనే పల్లెల అభివృద్ధి

by Nallavelli.Anjaneyulu |

కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సోమవారం ఆయన మండలంలో సుడిగాలి పర్యటన చేశారు.

కాంగ్రెస్ పార్టీతోనే పల్లెల అభివృద్ధి
X

దిశ, కొడిమ్యాల : కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సోమవారం ఆయన మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలలో రూ. కోటి 10 లక్షలతో నూతనంగా నిర్మించిన మూడు గ్రామపంచాయతీ భవనాలను ప్రారంభించారు. ఐదు గ్రామాలలో గ్రామ సమైక్య భవనాలకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలోనీ గ్రామ పంచాయతీ ఆవరణలో 35 మందిలబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, 91 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అలాగే రైతులకు సబ్సిడీ పనిముట్లను ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం జీవన్ రెడ్డి, సర్పంచ్ ల‌ ఫోరం మండల అధ్యక్షుడు కడరీ మల్లేశం, ఉప సర్పంచ్ గుర్రం నర్సయ్య ,వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

Next Story