ఆటోకి సైడ్ ఇవ్వ‌లేద‌ని ఆర్టీసీ డ్రైవ‌ర్ పై దాడి.. కేసు న‌మోదు

by Ratna Kumari |

ఆటోకి సైడ్ ఇవ్వ‌లేద‌ని ఆర్టీసీ డ్రైవ‌ర్ పై దాడి చేసిన ఘ‌ట‌న జ‌గిత్యాల టౌన్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

ఆటోకి సైడ్ ఇవ్వ‌లేద‌ని ఆర్టీసీ డ్రైవ‌ర్ పై దాడి.. కేసు న‌మోదు
X

దిశ, జగిత్యాల టౌన్: ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్ పై ఆటో డ్రైవ‌ర్ దాడి చేసిన సంఘ‌ట‌న జ‌గిత్యాల ప‌ట్ట‌ణ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. టౌన్ ఎస్సై సుప్రియ‌ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. వ‌రంగ‌ల్ డిపో నుంచి నిజామాబాద్ కి విధుల్లో భాగంగా మ‌హ‌మ్మ‌ద్ జ‌లీల్ బ‌స్సు తీసుకొని వ‌చ్చాడు. జ‌గిత్యాల ప‌ట్ట‌ణంలోకి రాగానే ఆటో డ్రైవ‌ర్ ముసుకు ప్ర‌దీప్ వెనుక వైపు నుంచి హార‌న్ కొట్టాడు. అయితే ఆటోకి సైడ్ ఇవ్వ‌లేద‌ని కొత్త బ‌స్టాండ్ ప్రాంగ‌ణంలోకి వ‌చ్చి బ‌స్సు డ్రైవ‌ర్ ని బూతు మాట‌లు తిడుతూ చేతుల‌తో బ‌లంగా కొట్టాడ‌ని ఆర్టీసీ డ్రైవ‌ర్ జ‌లీల్ ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు ఎస్సై సుప్రియ తెలిపారు.

Next Story