- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ బస్సు ఢీ..ఇంజనీరింగ్ విద్యార్ధికి తీవ్ర గాయాలు
by velandi.Saikiran |
తిమ్మాపూర్ మండల కేంద్రంలోని రాజీవ్ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్ధి తీవ్రంగా గాయపడ్డాడు.

X
దిశ, తిమ్మాపూర్ : తిమ్మాపూర్ మండల కేంద్రంలోని రాజీవ్ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్ధి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు స్థానికుల కథనం మేరకు.. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కేతిరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎల్ఎండిలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాగా బుధవారం కళాశాలకు వెళ్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు వెనుక నుండి ఢీకొట్టడంతో అతనికి తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.
Next Story






