- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దొంగలొస్తారు తస్మాత్ జాగ్రత్త !
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఇటీవల దొంగలు వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాళాలు వేసిన ఇండ్లనే దొంగలు టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఇళ్లకు తాళాలు వేసి, వెళ్లాలంటే ప్రజలు భయపడిపోతున్నారు.

దిశ,గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఇటీవల దొంగలు వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాళాలు వేసిన ఇండ్లనే దొంగలు టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఇళ్లకు తాళాలు వేసి, వెళ్లాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. నాగంపేట గ్రామంలో శనివారం రాత్రి దొంగలు తాళాలు వేసిన 10 ఇండ్లలో బీభత్సవం సృష్టించారు. గతంలో ఏన్నడు లేని విధంగా ఏకంగా 10 ఇండ్లలో దొంగతనానికి పాల్పడడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏదో ఒక గ్రామంలో ఒకటి రెండు ఇండ్లకు పరిమితమైన దొంగతనాలు 10 ఇండ్లకు విస్తరించడంతో వామ్మో ఇదేమి దొంగతనాలు అంటూ ప్రజలు వానికి పోతున్నారు. ఈ మధ్యనే కొలమద్ది కూడా రెండు తాళాలు వేసిన రెండు ఇళ్లల్లో దొంగతనాలు దొంగతనానికి పాల్పడి, బంగారు వెండి ఆభరణాలను ఎత్తు కెళ్లారు. కోలమద్ది లో దొంగతనం జరిగి వారం కూడా గడవక ముందే నాగం పేటలో దొంగలు ఏకంగా 10 ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. గంభీరావుపేట మండలంలో ఓ ఒకవైపు పోలీసులు రాత్రి వేళలో పెట్రోలింగ్ తిరుగుతున్న దొంగతనాలు ఆగడం లేదు. రాత్రి సమయంలో పోలీసులు గ్రామాల్లో ముమ్మరంగా పెట్రోలింగ్ తిరుగుతున్నారు. అయినా వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. పోలీసులకు సవాలుగా మారిన ఈ వరుస దొంగతనాలను నివారించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దొంగతనాలకు పాల్పడుతున్న ఈ దొంగలు ఈ ప్రాంతానికి చెందిన వార.. లేక ఇతర ప్రాంతాలకు చెందిన దొంగల ముఠా సభ్యుల అనేది అంతు చిక్కడం లేదు.
పని చేయని నిఘ నేత్రాలు..
గంభీరావుపేట మండలం తో పాటు పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలులో కొన్ని పని చేయడం లేదు. పలు సంఘటనలకు నివారించేందుకు ద్రోహత పడే నిఘ నేత్రాలు పని చేయక పోవడం కూడా సమస్యగా మారింది.






