Road Repair : రోడ్డు వేశారు.. మట్టి మరిచారు

by Chintha Aamani |

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి ఎస్సీ

Road Repair : రోడ్డు వేశారు.. మట్టి మరిచారు
X

దిశ,వీర్నపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి ఎస్సీ కాలనీ నుంచి బస్టాండ్ వరకు నిర్మించిన సీసీ రోడ్డు పై పోసిన మట్టిని తొలగించాలని స్థానికులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. 20 రోజులుగా కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లిన నిర్లక్ష్యం వహిస్తున్నాడని తెలిపారు.నిత్యం అధికంగా వాహనాలు రాకపోకలకు సాగుతుంటాయి కావున ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.రోడ్డుపై మట్టిని తొలగించి రోడ్డు అంచుల వెంబడి మట్టి పోయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ మండల అధ్యక్షుడు గజ్జెల ప్రశాంత్, CITU జిల్లా కార్యదర్శి గుంటుకు నరేందర్, నగరపు దేవేందర్, ఆరేళ్ల ఆంజనేయులు, సుంకటి రాములు, రాజయ్య, జుట్టు నర్సయ్య, ప్రశాంత్,మహేష్,సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story