యువకుడి ఉసురు తీసిన అతివేగం.. ఒకరి తప్పుకు మరొకరు బలి..

by Bhanu |   (  Updated:2025-06-25 08:50:39  IST  )

వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డి జిల్లా బిక్కునూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి దుర్మరణం చెందాడు.

యువకుడి ఉసురు తీసిన అతివేగం.. ఒకరి తప్పుకు మరొకరు బలి..
X

దిశ, వేములవాడ టౌన్ : వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డి జిల్లా బిక్కునూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. శేఖర్ స్థానికంగా ఓ పెట్రోల్ బంక్‌లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈరోజు ఉదయం రోడ్డు క్రాస్ చేస్తున్న టాటా ఏసీ వాహనాన్ని అతివేగంగా వచ్చి శేఖర్‌ ఢీకొట్టాడు. అతివేగంగా ఢీకొట్టడంతో శేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలో జరుగుతున్న వరుస ప్రమాదాలతో వాహనదారులంతా నెమ్మదిగా , జాగ్రత్తగా నడపాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని పోలీసులు సూచిస్తున్నారు.

Next Story