మెట్ పల్లిలో రోడ్డు ప్రమాదం

by Elthuri vijay kumar |

మెట్ పల్లి పట్టణం వెంకట్రావు పేట్ శివారులోని శక్తి బార్ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ నుంచి హన్మకొండ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వేగంగా వచ్చి ఢీకొట్టింది.

మెట్ పల్లిలో రోడ్డు ప్రమాదం
X

మెట్ పల్లిలో రోడ్డు ప్రమాదం

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

వ్యక్తికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

దిశ, మెట్ పల్లి : మెట్ పల్లి పట్టణం వెంకట్రావు పేట్ శివారులోని శక్తి బార్ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ నుంచి హన్మకొండ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలకాగా, స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story