- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అక్కడి నిర్వాహకులు చూసుకోవాలని ధర్మారం మండలం మార్కెట్ కమిటి చైర్మెన్ రూప్లా నాయక్ అన్నారు.

దిశ, ధర్మారం : వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అక్కడి నిర్వాహకులు చూసుకోవాలని ధర్మారం మండలం మార్కెట్ కమిటి చైర్మెన్ రూప్లా నాయక్ అన్నారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో రైతులతో కలిసి వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంబించారు. ఈ సందర్బంగా మార్కెట్ చైర్మెన్ రూప్లా నాయక్ మాట్లాడుతూ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని రైతులు ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో కొనుగోలు కేంద్రాల వద్దకు రావాలని సూచించారు. ధాన్య కొనుగోళ్ళ విషయంలో రైతులను అక్కడి నిర్వాహకులు, మిల్లర్లు ఇబ్బందులు పెడితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. రైతులను ఇబ్బందులు పెడితే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు సంక్షేమ ప్రభుత్వమని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులు సమన్వయంతో పని చేస్తూ, ఒక మంచి వాతావరణంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మెన్ లింగయ్య, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రంజిత్, సర్పంచులు వీర్ పాల్, మల్లయ్య, మంగ పాటు కాంగ్రెస్ నాయకులు అంజయ్య,నర్సింహులు, నాగరాజు, రైతులు పాల్గొన్నారు.






