- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ భూమిలో ఉర్సు షెడ్లు.. పోలీస్ బందోబస్తులో కూల్చివేత
ఎల్లారెడ్దిపేట మండలంలోని మక్తసింగారం గ్రామంలోని సర్వే నంబర్ 365లో గల దర్శవాలి గుట్టపై అనుమతులు లేకుండా నిర్మించిన షెడ్లను తహశీల్దార్ డి.సుజాత పర్యవేక్షణలో జేసీబీ యంత్రం సహాయంతో కూల్చివేశారు.

దిశ, ఎల్లారెడ్దిపేట : ఎల్లారెడ్దిపేట మండలంలోని మక్తసింగారం గ్రామంలోని సర్వే నంబర్ 365లో గల దర్శవాలి గుట్టపై అనుమతులు లేకుండా నిర్మించిన షెడ్లను తహశీల్దార్ డి.సుజాత పర్యవేక్షణలో జేసీబీ యంత్రం సహాయంతో కూల్చివేశారు. మండలంలోని మక్త సింగారంలో దర్శవాలి గుట్టపై ఈ ఏడాది కూడా ఉర్సు ఉత్సవాలు నిర్వహణ కోసం సుమారు ఎకరం బంచరాయి భూమిని ఆక్రమించి రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి లేకుండా తాత్కాలిక స్టేజీ వేశారు. ఈ మేరకు బీజేపీ నాయకులు కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తహశీల్దార్ డి.సుజాతను విచారణ జరిపిన బంచ రాయి భూమి ఆక్రమణ నిజమేనని తేల్చారు. దీంతో స్టేజీను, అక్కడ భక్తుల సౌకర్యార్థం వేసిన షెడ్లను మంగళవారం పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేశారు.
ఎల్లారెడ్దిపేట మండలంలోని మక్తసింగారం గ్రామంలోని సర్వే నంబర్ 365లో గల దర్శవాలి గుట్టపై ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన షెడ్లను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు మంగళవారం వేకువజామున నుంచి మండల తహశీల్దార్ డి.సుజాత పర్యవేక్షణలో జేసీబీ యంత్రం సహాయంతో కూల్చివేశారు. మండలంలోని మక్త సింగారంలో ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 365లో సుమారు 100 ఎకరాల వరకు బంచరాయి భూమి ఉంది. ఇక్కడే చాలా సంవత్సరాల కింద దర్శవాలి అనే దేవుడు గుట్టపై వెలిశాడని నమ్మి దర్శవాలి గుట్టగా గ్రామ ప్రజలు నామకరణం చేశారు. అప్పటి నుంచి హిందూ, ముస్లింలు ఇక్కడికి వెళ్లి మొక్కులు చెల్లించుకోవడం ప్రారంభించారు.
కొద్ది సంవత్సరాల నుంచి ఇక్కడ ఎల్లారెడ్డిపేటలో ఉంటున్న అజీజ్ భాయ్ ప్రతి ఏటా ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. ఇందులో భాగంగా వందల మంది ఉర్సు ఉత్సవాలకు హాజరు కాగా భోజన వసతి కల్పిస్తూ ముంబై నుంచి ప్రముఖ గాయకులను తెప్పించి కవ్వాలి నిర్వహిస్తు్న్నారు. ఈ ఏడాది కూడా ఉర్సు ఉత్సవాలు నిర్వహించడం కోసం సుమారు ఎకరం బంచరాయి భూమిని ఆక్రమించి రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి లేకుండా తాత్కాలిక స్టేజ్ కూడా వేశారని బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలని తహశీల్దార్ డి.సుజాతను ఆదేశించారు. విచారణ జరిపిన తహశీల్దార్ బంచచరాయి భూమి ఆక్రమించింది నిజమేనని తేలడంతో స్టేజీను, అక్కడ భక్తుల సౌకర్యార్థం వేసిన షెడ్లను కూల్చివేయాలని కలెక్టర్ ఆదేశించారు.
దీంతో స్టేజ్, షెడ్లు కూల్చేవేసే సమయంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులను ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ మురళీ కృష్ణ, మండల ఆర్ఐ శ్రవణ్ ఉన్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాస్ గౌడ్, ఎస్ఐ నేరెళ్ల రమాకాంత్, ప్రొబేషనరీ ఎస్ఐ వేముల లక్ష్మణ్, సుమారు 100మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. తహశీల్దార్, సీఐలు మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు జరిపిన శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సింగారంలోని సర్వే నంబర్ 365 దర్శవాలి గుట్ట వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని, అక్కడికి ఎవరు వెళ్లొద్దని హెచ్చరించారు. బాధితుడు అజీజ్ బాయ్ మాట్లాడుతూ తన మీద కొంతమంది కక్ష సాధింపునకు పాల్పడ్డారని అన్నారు. గుట్ట వద్ద రూ.లక్షలు తన సొంత డబ్బు వెచ్చించి షెడ్లు నిర్మిస్తే ఓర్వలేక కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.






