దిశ క‌థ‌నానికి స్పంద‌న‌.. ఫ్లెక్సీ ఏర్పాటు

by Ratna Kumari |

తుర్కపల్లి గ్రామంలోని లే అవుట్ వివాదం పై ఇటీవల వెలువడిన దిశ కథనానికి అధికారులు స్పందించారు.

దిశ క‌థ‌నానికి స్పంద‌న‌.. ఫ్లెక్సీ ఏర్పాటు
X

దిశ‌, ముస్తాబాద్ : తుర్కపల్లి గ్రామంలోని లే అవుట్ వివాదం పై ఇటీవల వెలువడిన దిశ కథనానికి అధికారులు స్పందించారు. లే అవుట్ స్థలంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అనధికార లే అవుట్‌గా గుర్తించిన ఈ స్థలంలో కొనుగోలు, అమ్మకాలు చేయవద్దని హెచ్చరికగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ చర్య పై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం తాత్కాలిక పరిష్కారమే కానీ శాశ్వత పరిష్కారం కాదని వారు పేర్కొన్నారు. లే అవుట్ స్థలంలో స్పష్టమైన బోర్డు ఏర్పాటు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఎలాంటి అక్రమాలు జరగకుండా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Next Story