దిశ క‌థ‌నానికి స్పంద‌న‌.. చెట్లు ధ్వంసం చేసిన వ్య‌క్తికి జ‌రిమానా

by Ratna Kumari |

హ‌రిత‌హారం మొక్క‌ల‌ను ధ్వంసం అనే పేరుతో దిశ దిన ప‌త్రిక‌లో ప్ర‌చురించిన క‌థ‌నానికి అధికారులు, స‌ర్పంచ్ సొల్లు అజ‌య్ వ‌ర్మ‌, పాల‌కవ‌ర్గ స‌భ్యులు స్పందించారు.

దిశ క‌థ‌నానికి స్పంద‌న‌.. చెట్లు ధ్వంసం చేసిన వ్య‌క్తికి జ‌రిమానా
X

దిశ‌, గ‌న్నేరువ‌రం : హ‌రిత‌హారం మొక్క‌ల‌ను ధ్వంసం అనే పేరుతో దిశ దిన ప‌త్రిక‌లో ప్ర‌చురించిన క‌థ‌నానికి అధికారులు, స‌ర్పంచ్ సొల్లు అజ‌య్ వ‌ర్మ‌, పాల‌కవ‌ర్గ స‌భ్యులు స్పందించారు. గ్రామపంచాయతీ కార్యదర్శి రాజేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించి చెట్లు ధ్వంసం చేసిన గ్రామానికి చెందిన పొన్నాల మధు అనే వ్యక్తికి నోటీస్ జారీ చేసి జరిమానా విధించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ హరితహారం మొక్కలు చెట్లు ఎవరు ధ్వంసం చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న గ్రామ సర్పంచ్, పాలకవర్గం సభ్యులు, అధికారుల తీరు పై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story