ప్రమాదవశాత్తు నిప్పంటుకొని నివాస గృహం దగ్ధం

by Ratna Kumari |

ప్రమాదవశాత్తు నిప్పంటుకొని నివాసగృహం దగ్ధమైన సంఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఎగ్లాస్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

ప్రమాదవశాత్తు నిప్పంటుకొని నివాస గృహం దగ్ధం
X

దిశ, సైదాపూర్ : ప్రమాదవశాత్తు నిప్పంటుకొని నివాసగృహం దగ్ధమైన సంఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఎగ్లాస్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మోరే నరేష్-జమున దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరు ఎస్సీ కాలనీలో నివాసం ఉండేందుకు పూరి గుడిసెను ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. శుక్రవారం ప్రమాదవశాత్తు పూరి గుడిసె కు నిప్పంటుకొని పూర్తిగా దగ్ధమైంది. తాము నివాసమున్న గుడిసె మంటలను చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మంటల్లో నిత్యావసర సరుకులతో పాటు బట్టలు, బియ్యం, గ్యాస్‌, ఇతర వస్తువులు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Next Story