- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీబీఎస్ఈ అనుమతి లేకుండా కొనసాగుతున్న జ్యోతిష్మతి పాఠశాలపై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ కి వినతి
సీబీఎస్ ఈ అనుమతి లేకుండా నడిపిస్తున్న జ్యోతిష్మతి అకాడమీపై చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే కు బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సిరిశెట్టి రాజేష్ గౌడ్ వినతి పత్రం అందజేశారు.

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : సీబీఎస్ ఈ అనుమతి లేకుండా నడిపిస్తున్న జ్యోతిష్మతి అకాడమీపై చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే కు బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సిరిశెట్టి రాజేష్ గౌడ్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిరి శెట్టి రాజేష్ గౌడ్ మాట్లాడుతూ లేనోడి పొట్ట కొట్టి ఉన్నోడీ జేబులు నింపడం కోసం విద్యా సంస్థ యజమాన్యాలు ఇంతకైనా తెగిస్తారు అన్నదానికి నిదర్శనంగా నిలుస్తుంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలాన్ని స్తులాపూర్ గ్రామంలో నడపడానికి అనుమతి పొందిన జ్యోతిష్మతి అకాడమీ (CBSE అఫిలియేషన్ నం: 3630033) పాఠశాల ప్రస్తుతం కరీంనగర్ మున్సిపాలిటీ పరిధిలోని విద్యానగర్ ప్రాంతంలో నిర్వహించబడుతోంది అనే విషయం వెలుగులోకి రావడం కలవరానికి గురి చేస్తుందన్నారు.
సీబీఎస్ఈ అధికారిక రికార్డుల్లో ఒక చిరునామా ఉండగా, ప్రస్తుతానికి పాఠశాల మరో ప్రాంగణంలో నడుస్తుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఒక పాఠశాల తన అనుమతి పొందిన ప్రదేశాన్ని విడిచిపెట్టి, వేరే చోట నిర్వహించాలంటే కచ్చితమైన చట్టపరమైన అనుమతులు, భద్రతా ధృవపత్రాలు, మున్సిపల్ ఆమోదాలు, అగ్నిమాపక శాఖ అనుమతులు తప్పనిసరిగా ఉండాలని నిబంధనలు సైతం పొందుపరచి ఉన్నాయన్నారు. విద్య అనేది వ్యాపారం కాదు.. అది భవిష్యత్ నిర్మాణం. ఒక చిన్న నిర్లక్ష్యం వందలాది విద్యార్థుల భవిష్యత్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని తల్లిదండ్రులు తమ పిల్లలను నమ్మకంతో పాఠశాలకు పంపుతారు. ఆ నమ్మకానికి భంగం కలగకూడదని అన్నారు.ఈ నేపథ్యంలో ఈ విషయంపై ఇప్పటికే స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు వెంటనే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అనుమతి లేకుండా కొనసాగుతున్న సీబీఎస్ ఈ పేరుతో నడుస్తున్న విద్యాసంస్థలను గుర్తించి సంబంధిత అధికారులు తక్షణమే సమగ్ర విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. పారదర్శకతే విశ్వాసానికి పునాది. నిజాలు బయటకు రావాలి. విద్యార్థుల భద్రత, తల్లిదండ్రుల నమ్మకం, విద్యా వ్యవస్థ గౌరవం కాపాడబడాలని జిల్లా అధికారులను కోరుతున్నామని అన్నారు.






