- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంత మంది ప్రాణాలు తీస్తారు..?
నిత్యం రోడ్డు యాక్సిడెంట్లతో ఎంత మంది ప్రాణాలు తీస్తారని, అధ్వాన్నమైన రోడ్లను వెంటనే సరి చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాజీపేట శివాజీ రామగుండం కార్పొరేషన్ అధికారులను హెచ్చరించారు.

దిశ, గోదావరిఖని : నిత్యం రోడ్డు యాక్సిడెంట్లతో ఎంత మంది ప్రాణాలు తీస్తారని, అధ్వాన్నమైన రోడ్లను వెంటనే సరి చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాజీపేట శివాజీ రామగుండం కార్పొరేషన్ అధికారులను హెచ్చరించారు. మంగళవారం కార్పొరేషన్ కార్యాలయం ముందు నిరసన తెలిపి అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకై రోడ్ సేఫ్టీ అథారిటీ, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ ప్రమాణాలు పాటించకుండా, రోడ్ల పేరు పక్కన సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు వెంటనే కళ్ళు తెరవాలన్నారు.
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తున్నటువంటి ఇందిరానగర్, గౌతమి నగర్ ప్రమాద స్థలాలను బిజెపి నాయకులు పరిశీలించారు. అదేవిధంగా మాస్టర్ ప్లాన్లో 60 ఫీట్ల రోడ్డు అని చెబుతున్న గౌతమి నగర్ వెళ్లే రహదారిని బిజెపి నాయకులు స్వయంగా కొలచి టౌన్ ప్లానింగ్ అధికారులకు వివరించారు. మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయ సెక్రటరీ ఉమామహేశ్వర్ కి వినతిపత్రం అందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. వారం రోజుల్లో ప్రమాద స్థలాల మధ్య నివారణ చర్యలు చేపట్టకుంటే బీజేపీ ఆధ్వర్యంలో రామగుండం కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. లక్ష్మీ నగర్ మండల అధ్యక్షురాలు ఊరగొండ అపర్ణ, మాజీ మండల అధ్యక్షులు కోడూరు రమేష్ మధురం జరిగిన కార్యక్రమంలో బిజెపి మాజీ జిల్లా కార్యదర్శి జక్కుల నరహరి, మాతంగి రేణుక, తిలక్ నగర్ మండల అధ్యక్షులు ఐత పవన్, సులువ లక్ష్మీ నరసయ్య, కొండపర్తి సంజీవ్ కుమార్, మాదర బోయిన రాకేష్, జనగామ సాగర్, కంపెల్లి రఘు, రాజేష్ శర్మ, శ్రావణ్ యాదవ్, రాజ్ కుమార్, బంగారి సునీల్, కుమార్, సాయి ప్రదీప్, వేరుకొండ ప్రవీణ్ గౌడ్, కొమ్మల స్వామి, పులిపాక పూర్ణ చందర్, పాశం రాజు, మురళి గౌడ్ పాల్గొన్నారు.






