- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారు నాటారు... వీరు నరికారు! చెట్లను రక్షించే వ్యక్తి ఎవరన్నది ప్రశ్నగా మారింది
"వృక్షో రక్షతి రక్షితః" అనే మాటలు ఈ మధ్య వదిలిపెట్టిన నినాదాలయ్యాయి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద గత ప్రభుత్వ హయంలో అవగాహన లేకుండా విద్యుత్ వైర్ల కిందే మొక్కలు నాటి వేశారు.

దిశ, ఎల్లారెడ్డిపేట: "వృక్షో రక్షతి రక్షితః" అనే మాటలు ఈ మధ్య వదిలిపెట్టిన నినాదాలయ్యాయి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద గత ప్రభుత్వ హయంలో అవగాహన లేకుండా విద్యుత్ వైర్ల కిందే మొక్కలు నాటి వేశారు.ఇప్పుడు విద్యుత్ శాఖ అధికారులు అవే చెట్లు విద్యుత్ సరఫరాకు అడ్డుగా వస్తున్నాయని నిర్దాక్షిణ్యంగా నరికేస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని చాలా గ్రామాల్లో వైర్ల కింద నాటిన మొక్కలను ఆదివారం రోజున అధికారులు లేని సమయంలో తొలగించడం స్థానిక ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. "వారు నాటారు, వీరు నరికారు... చెట్లను నరికితే పట్టించుకునేది ఎవరా?" అనే విధంగా ప్రజలు గళం విప్పుతున్నారు. చెట్లు నరకడం వల్ల ప్రజాధనం వృథా అవుతుందని, పర్యావరణానికి హానికరమని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండల కేంద్రంలోని ఫస్ట్ బైపాస్ సెకండ్ బైపాస్ మధ్య ఉన్న ప్రాంతంలో ఖాళీ స్థలంలో ఉన్న ఓ చెట్టును వ్యక్తిగతంగా తొలగించడంతో కాలనీవాసులు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. దీనిపై చర్యలు తీసుకుంటామని గ్రామ పంచాయతీ సిబ్బంది వెల్లడించినా, కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చెట్టు తొలగించిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకుని జరిమానా విధించాలని వాసులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా చూస్తే, అధికారులు మొక్కలు నాటి, తర్వాత వాటినే నరికి పెట్టిన విధానం ప్రజల్లో ఆగ్రహానికి దారితీసింది. మొక్కలు నాటడం ఒక ప్రచార కార్యక్రమంగా మిగిలిపోకుండా, వాటి సంరక్షణకూ ప్రభుత్వం సమర్థంగా ముందుకు రావాలని ప్రజలు కోరుతున్నారు.






