రైతాంగం ఆగమైతుంటే.. ప్రభుత్వానికి పట్టింపేది?

by velandi.Saikiran |

ఒక వైపు యూరియా కొరతతో... మరోవైపు వర్షాలతో తెలంగాణా రైతాంగం ఆగమై తుంటే ప్రభుత్వానికి పట్టింపేదని రసమయి

రైతాంగం ఆగమైతుంటే.. ప్రభుత్వానికి పట్టింపేది?
X

దిశ, ఇల్లంతకుంట : ఒక వైపు యూరియా కొరతతో... మరోవైపు వర్షాలతో తెలంగాణా రైతాంగం ఆగమై తుంటే ప్రభుత్వానికి పట్టింపేదని మాన కొండూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ఫైర్ అయ్యారు. శనివారం మండలంలోని దాచారం, వల్లంపట్ల, బోటు మీది పల్లె గ్రామాల్లో వివిధ అనారోగ్యం సమస్యలతో మృతి చెందిన వారి కుటుంబాలను రసమయి పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పరిపాలన చేయడం అంటే బూటకపు వాగ్దానాలు చేసినంత సులువు కాదని ఆయన ఎద్దెవా చేశారు.

యూరియా బస్తాల కోసం రైతులు అధికారుల కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడడం బాధగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న యూరియా అడుగుతే పోలీసు లాటీలతో కొట్టిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేతగానితనం వల్లనే ఈరోజు రైతులకు ఇన్ని కష్టాలు వచ్చాయని ఆయన వాపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముందుచూపు లేకపోవడం వల్లనే రైతులు కన్నీళ్లు పెట్టాల్సి వస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ జెడ్పి వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పల్లె నర్సింహారెడ్డి, ఆయా గ్రామాల మాజీ ప్రజా ప్రతినిధులు మరియు టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Next Story