- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాంటీ నార్కోటిక్స్ స్నిఫర్ డాగ్ తో అకస్మిక తనిఖీలు
by Ratna Kumari |
మంథని పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దపల్లి నార్కోటిక్ బృందం, మంథని పోలీసులు సంయుక్తంగా యాంటీ నార్కోటిక్స్ స్నిఫర్ డాగ్ స్క్వాడ్‌తో కలిసి గురువారం మంథని బస్టాండ్ పరిసర ప్రాంతాలు, పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

X
దిశ, మంథని : మంథని పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దపల్లి నార్కోటిక్ బృందం, మంథని పోలీసులు సంయుక్తంగా యాంటీ నార్కోటిక్స్ స్నిఫర్ డాగ్ స్క్వాడ్‌తో కలిసి గురువారం మంథని బస్టాండ్ పరిసర ప్రాంతాలు, పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్‌లోని ప్రయాణికుల బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు. బైక్ పార్కింగ్ ప్రాంతాలు, ఆటో స్టాండ్లు, హోటళ్లు, పాన్ షాపులు, అనుమానాస్పద ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. ఎవరైనా గంజాయి, మత్తు పదార్థాలు విక్రయించినా, సేవించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని మంథని ఎస్‌ఐ రమేష్ హెచ్చరించారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడమే లక్ష్యంగా ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.
Next Story






