- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గంభీరావుపేటలో యథేచ్ఛగా రేషన్ బియ్యం దందా..
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంతో పాటు పరిసర గ్రామాల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా మరింత ఉధృతంగా సాగుతోంది.

దిశ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంతో పాటు పరిసర గ్రామాల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా మరింత ఉధృతంగా సాగుతోంది. అధికారులు మాత్రం ఈ దందాపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పిడిఎస్ (ప్రజా పంపిణీ వ్యవస్థ) ద్వారా ప్రజలకు సన్న బియ్యం సరఫరా చేస్తోంది. దీని ద్వారా అక్రమ రవాణా తగ్గుతుందని భావించినా, గతంతో పోల్చితే ఇప్పుడు మరింత పెద్దఎత్తున బియ్యం దారి మళ్లుతోంది.
అధికారుల నిర్లక్ష్యంతో క్వింటాళ్ల కొద్దీ బియ్యం పక్కదారి పడిపోతుండటం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం రేషన్ దుకాణాల నుంచి నిల్వచేసి ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. ప్రజలు తినే కొరకూ కాకుండా వ్యాపారం కోసమే దాన్ని కొనుగోలు చేస్తున్నారు.
రేషన్ బియ్యం కోసం ప్రత్యేక ముఠాలు సిద్ధంగా
గంభీరావుపేట మండలంతో పాటు ఇతర గ్రామాల్లో రేషన్ బియ్యం సేకరణకు ప్రత్యేక ముఠాలు ఏర్పాటు అయ్యాయి. ఇవి చైన్ సిస్టం మాదిరిగా వ్యవస్థాపితంగా పని చేస్తున్నాయి. డీలర్లతో కలసి వినియోగదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసి పాత ఇళ్లలో లేదా గోదాముల్లో నిల్వ ఉంచి రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి 25 కిలోల బస్తాల్లో ప్యాక్ చేసి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కమిషన్ మాయ.. వ్యాపారంగా మారిన దందా
బియ్యం దందాలో కమిషన్ అధికంగా ఉండటం వల్ల చాలామంది దీన్ని సంపాదనా మార్గంగా మార్చుకుంటున్నారు. ప్రతి కిలోపై సగటున రూ.15 వరకూ లాభం వస్తుండటంతో ఈ దందాలో అనేకమంది చేరిపోయారు. అధికారుల నిర్లక్ష్యం, నిబంధనల లొసుగులు ఈ అక్రమ వ్యవస్థకు చాలామంది దీనిని వృత్తిగా మార్చుకొని వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.






