- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్తిపన్ను వసూళ్లలో రాష్ట్రంలో మొదటి స్థానం
ఎర్లీ బర్డ్ ఆఫర్ లో ఆస్తి పన్ను వసూలు చేయడంలో రామగుండం నగర పాలక సంస్థ ఇతర మున్సిపల్ కార్పొరేషన్ లతో పోలిస్తే ప్రధమ స్థానంలో నిలిచి ఉత్తమ ప్రతిభ కనబరిచింది .

దిశ, గోదావరిఖని: ఎర్లీ బర్డ్ ఆఫర్ లో ఆస్తి పన్ను వసూలు చేయడంలో రామగుండం నగర పాలక సంస్థ ఇతర మున్సిపల్ కార్పొరేషన్ లతో పోలిస్తే ప్రధమ స్థానంలో నిలిచి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 ఆస్తిపన్ను చెల్లించిన వారికి పన్ను మొత్తంలో ఐదు శాతం రాయితీ ప్రకటిస్తూ ప్రభుత్వం ఏప్రిల్ మొదటి వారంలో ఎర్లీ బర్డ్ ఆఫర్ ప్రకటించింది . ఎర్లీ బర్డ్ ఆఫర్ గడువు మొదట ఏప్రిల్ 30 తో ముగిసిపోయినప్పటికీ ప్రజల అభ్యర్థన మేరకు మే 7 వరకు ప్రభుత్వం పొడిగించింది. గడువు ముగిసిపోయే సమయానికి రామగుండం నగర పాలక సంస్థ 47.91 శాతం పన్ను వసూలు సాధించి ఇతర మున్సిపల్ కార్పొరేషన్లతో పోలిస్తే ప్రధమ స్థానంలో , రాష్ట్రంలోని 151 పట్టణ స్థానిక సంస్థలలో నాలుగవ స్థానంలో నిలిచింది.
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో 51,033 ఆస్తి పన్ను అస్సెస్స్మెంట్లు ఉండగా మొత్తం పన్ను డిమాండ్ రూ 19 . 14 కోట్లు ఉంది. ఇందులో 13, 915 పన్ను అస్సెస్స్మెంట్ల నుండి రూ 9.7 కోట్లు వసూలయింది. రామగుండం నగర పాలక సంస్థ ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష , కమిషనర్ గా వ్యవహరిస్తున్న అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) అరుణ శ్రీ ఎప్పటికప్పుడు పన్ను వసూళ్ల పురోగతిని సమీక్షిస్తూ సిబ్బందికి మార్గ నిర్దేశం చేయడంతో స్వల్ప వ్యవధిలోనే రామగుండం నగర పాలక సంస్థ ఈ ఘనత సాధించింది. పన్ను వసూళ్లలో రామగుండం నగర పాలక సంస్థ ముందంజలో ఉండడానికి కృషి చేసిన డిప్యూటీ కమిషనర్ వెంకట స్వామి , ఆర్ . ఓ . ఆంజనేయులు , ఆర్ ఐ లు శంకర్ రావు , ఖాజా , వార్డు అధికారులు , బిల్ కలెక్టర్లను రామగుండం నగర పాలక సంస్థ ప్రత్యేకాధికారి , కమిషనర్ అభినందించారు.






