జగన్మాత అనుగ్రహం.. సింగరేణి కార్మికవర్గం సుభిక్షం

by velandi.Saikiran |

జగన్మాత అనుగ్రహంతో కార్మిక వర్గం సుభిక్షంగా ఉండాలని రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆకాం

జగన్మాత అనుగ్రహం.. సింగరేణి కార్మికవర్గం సుభిక్షం
X

దిశ, యైటింక్లయిన్ కాలనీ: జగన్మాత అనుగ్రహంతో కార్మిక వర్గం సుభిక్షంగా ఉండాలని, సంస్థ లాభాల దిశగా పయనించాలని రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆకాంక్షించారు. మంగళవారం రామగుండం రీజియన్-2 డివిజన్ పరిధిలోని ఏరియా వర్క్ షాప్ లో దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై పాల్గొన్నారు.

ఆలయంలో ప్రత్యేక పూజలు చేయగా అర్చకులు ఆశీర్వాదం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన్ని ప్రారంభించి కార్మికులు, అధికారులు, యూనియన్ నాయకులతో కలిసి సహాపంక్తి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండేటి రాజేష్, మాజీ కార్పొరేటర్ బి.శంకర్ నాయక్,ఐరెడ్డి సంపత్ రెడ్డి, కొండగట్టు దేవస్థానం మాజీ డైరెక్టర్ జక్కుల దామోదర్, సాగంటి శంకర్, చాట్ల సదానందం, ఆఫ్సర్, మార్క రాజు, దేవనపల్లి చక్రపాణి, రేషవేణి కేశవులు, మెరుగు రాజేష్, పరకాల ప్రశాంత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు

Next Story