- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కీలక సూచనలు
రామగుండం కమిషనరేట్ పరిధి మంచిర్యాల, పెద్దపల్లి జోన్ లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు

దిశ, గోదావరిఖని : రామగుండం కమిషనరేట్ పరిధి మంచిర్యాల, పెద్దపల్లి జోన్ లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. మంగళవారం కమీషనర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు. మద్యం సేవించి వీధుల్లో రోడ్లపైన అసభ్య పదజాలంతో మాట్లాడటం, అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందిగా పరిణమిoచిoదని, మద్యం ప్రియులు ఆగడాలకు కళ్లెం వేయడంలో పాటు ప్రజల భద్రత రక్షణ కోసం నిషేధాజ్ఞలు విధించామన్నారు. చిన్నపిల్లలు వృద్ధులు రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా, శబ్ద కాలుష్యం నుంచి కాపాడేందుకు భారీ సౌండ్ లతో కూడిన డిజె సౌండ్ వినియోగం పై నిషేధాజ్ఞలు విధించారు. వివిధ కార్యక్రమాల నిర్వహణకు మైక్ సెట్ వినియోగం తప్పనిసరి అని అనిపిస్తే సంబంధిత డివిజన్ ఏసీపీ అనుమతి పొందాలని సూచించారు. హైదరాబాద్ నగర పోలీసు చట్టం, 1348 ఫసలీ నిబంధనలను అనుసరించి నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు.
ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. పైన పేర్కొన్న కార్యక్రమాల నిర్వహణకు ముందుగా పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలి, బంద్ ల పేరిట వివిధ కారణాలను చూపుతూ బలవంతంగా వివిధ సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు.






