- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామగుండం సిపి అర్థరాత్రి ఆకస్మిక తనిఖీలు
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్ అర్ధరాత్రి సమయంలో రామగుండం రైల్వే స్టేషన్, గోదావరి ఖని బస్ స్టాండ్, రామగుండం పోలీస్ స్టేషన్ పలుప్రాంతాల్లో ఆకస్మికంగా పరిశీలించారు.

X
దిశ, గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అర్ధరాత్రి సమయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మంగళ వారం అర్థరాత్రి రామగుండం రైల్వే స్టేషన్, గోదావరి ఖని బస్ స్టాండ్, రామగుండం పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. అనంతరం అర్ధరాత్రి వేళ గోదావరిఖని, రామగుండం ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది పోలీసుల పెట్రోలింగ్, గస్తీ పరిస్థితి ఏ విధంగా ఉందని ప్రత్యక్షంగా పరిశీలించారు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ లలో ప్రయాణికులతో మాట్లాడారు. అనంతరం రామగుండం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జీడీ బుక్‌ను పరిశీలించారు. ఆ సమయంలో స్టేషన్‌లో ఉన్న సిబ్బంది వివరాలు, విధులను అడిగి తెలుసుకున్నారు.
Next Story






