ఘనంగా ఐటీ విప్లవ పితామహుడు రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

by Kodari Anjali |

ఆధునిక భారత రూపకర్త, ఐటీ విప్లవ పితామహుడు, మాజీ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలను సైదాపూర్ పాత బస్టాండ్ వద్ద మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు.

ఘనంగా ఐటీ విప్లవ పితామహుడు రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
X

దిశ, సైదాపూర్: ఆధునిక భారత రూపకర్త, ఐటీ విప్లవ పితామహుడు, మాజీ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలను సైదాపూర్ పాత బస్టాండ్ వద్ద మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ ముందుచూపు వల్లే భారతదేశం ఇప్పుడు ఆర్థిక, సాంకేతిక రంగాల్లో పటిష్టంగా మారిందని, స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్, యువతకు 18ఏండ్లకే ఓటు హక్కు కల్పించడం వంటి నిర్ణయాలు రాజీవ్ గాంధీ హయాంలో తీసుకున్నవే అని గుర్తుచేశారు. కార్యక్రమంలో కొత్త తిరుపతిరెడ్డి, గుండారపు శ్రీనివాస్, లంక దాసరి మల్లయ్య, మేకల రవీందర్, రాఘవులు, రాజిరెడ్డి, విద్వాన్ రెడ్డి, కొండల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Next Story