- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భర్తతో ప్రాణహాని.. కలకలం రేపుతోన్న మహిళా సర్పంచ్ రాజీనామా లేఖ..
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాజారం గ్రామ సర్పంచ్ మమత తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్‌కు రాసిన ఉత్తరం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

X
దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాజారం గ్రామ సర్పంచ్ మమత తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్‌కు రాసిన ఉత్తరం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఉత్తరంలో తన భర్త వల్ల తనకు ప్రాణహాని ఉందని.. ఆగస్టు నెలలో గ్రామసభ నిర్వహించేందుకు రాజారాం గ్రామ పంచాయతీకి వెళ్ళగా తన భర్త అశోక్ మరికొంతమంది కుటుంబ సభ్యులు కలిసి తనపై దాడి చేసి కొట్టారని.. అంతటితో ఆగకుండా మళ్ళీ గ్రామంలోకి అడుగు పెడితే చంపేస్తామంటూ బెదిరించారని పేర్కొంది. తన భర్త అశోక్‌కు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని ఇదేంటని ప్రశ్నించినందుకే తనపై కక్ష పెంచుకొని దాడి చేశాడని.. ప్రాణహాని ఉంది కాబట్టే రాజీనామా చేయడానికి సిద్ధపడ్డానని లేఖలో తెలిపింది.
Next Story






