- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూ వివాదంలో ఇరు వర్గాల ఘర్షణ.. ఒకరికి తీవ్ర గాయాలు..
హుజురాబాద్ మండలం రాజపల్లి గ్రామంలో ఇంటి స్థలాల వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణకు కారణమైంది.

దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ మండలం రాజపల్లి గ్రామంలో ఇంటి స్థలాల వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణకు కారణమైంది. ఇరువర్గాలు తెలిపిన వివరాల ప్రకారం... రాజ పల్లి గ్రామానికి చెందిన మెరుగు సమ్మయ్య, కొమురయ్య, మెరుగు రమేష్ లు ముగ్గురు అన్నదమ్ములు. అన్నదమ్ములకు గ్రామ శివారులోని సుమారు 20 గుంటల భూమి ఉంది. గతంలోనే ముగ్గురు అన్నదమ్ములు భూమిని పంపకాలు చేసుకున్నారు. గతంలో చేసుకున్న పంపకాలకు విరుద్ధంగా సమ్మయ్య తోపాటు కుమారుడు మధు ఇంటిని నిర్మించుకుంటున్నారు.
దీనిని సమ్మయ్య సోదరులు వ్యతిరేకిస్తున్నారు. సమ్మయ్య నాలా కన్వర్షన్ తీసుకొని పంచాయతీ కార్యదర్శి ద్వారా పర్మిషన్ తీసుకున్నాడు. దీంతో వ్యతిరేకించిన కొమురయ్య, రమేష్ లు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసిన అధికారులు పంచాయతీ కార్యదర్శి నిబంధనలు విరుద్ధంగా అనుమతులు ఇచ్చిందని నిర్ధారించారు. దీనిపై సమ్మయ్య నిర్మిస్తున్న గృహ నిర్మాణ పనులు నిలిపివేయాలని పంచాయతీ కార్యదర్శి నోటీస్ జార్ చేసింది. అధికారులు తనని ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని సమ్మయ్య కోర్టుకు వెళ్ళాడు.దీంతో సమ్మయ్య అతని కుమారుడు పనులను నిలిపివేయకుండా నిర్మాణం చేపట్టారు. దీంతో కొమరయ్య, రమేష్ లు పనులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి సమ్మయ్య అతని కుమారుడు కొమరయ్యపై రాడుతో దాడి చేశాడు. ఈ దాడిలో కొమురయ్య తలకు తీవ్ర గాయమైంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను స్టేషన్ కు పిలిపించి విచారణ చేపట్టారు. గాయపడ్డ కొమరయ్యను ఆసుపత్రికి తరలించారు.
కాగా గతంలో ఈ విషయమై స్థానిక సీఐ కరుణాకర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ తమ గోడును పట్టించుకోలేదని గాయపడ్డ కొమురయ్య ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నిర్మాణం చేపడుతున్న తన అన్నకే పోలీసులు వత్తాసు పలకడం వల్ల ఈ ఘర్షణకు కారణమైందని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నిర్మాణం చేపడుతూ తమపై దాడి చేసిన సమ్మయ్య అతని కుమారుడు మధు పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని తాను పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అలాగే నిబంధనలను విరుద్ధంగా ఇంటి పర్మిషన్ ఇచ్చిన పంచాయతీ కార్యదర్శి కృపారాణి, మామూలు తీసుకొని న్యాల కన్వర్షన్ చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. ఏది ఏమైనా భూ వివాదములో పోలీసులు తల దూర్చడం, అధికారులు నిబంధనలు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడం రాజపల్లి లో చర్చనీయాంశంగా మారింది.






