- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజన్న ఆలయ విస్తరణ పనుల్లో వేగం పెంచాలి
వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనుల్లో వేగం పెంచాలని సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ కే ఎస్ శ్రీనివాస్ రాజ్ ఆదేశించారు.

దిశ, వేములవాడ : వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనుల్లో వేగం పెంచాలని సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ కే ఎస్ శ్రీనివాస్ రాజ్ ఆదేశించారు. శనివారం వేములవాడ పర్యటనకు వచ్చిన ఆయన కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసి రాజన్న ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి, విస్తరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకుముందు భీమేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీనివాస్ రాజ్ అనంతరం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఉచిత బస్సు సేవలను జెండా ఊపి ప్రారంభించారు. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇన్ చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసి ఆర్ అండ్ బీ, ఆలయ అధికారులు, ఆర్కిటెక్ట్ మూర్తి, కాంట్రాక్టర్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధాన ఆలయ విస్తరణ, ఇతర ప్రతి అభివృద్ధి పనికి సంబంధించి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. పనుల్లో వేగం పెంచాలని, అవసరమైన పనివారి సంఖ్య మరింత పెంచాలని ఆదేశించారు. పనుల పురోగతిలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని సమన్వయంతో పరిష్కరించాలని తెలిపారు. నాణ్యతతో పనులను పూర్తి చేయాలని సూచించారు. నూతన గోశాల నిర్మాణం, ఇతర అంశాలపై చర్చించారు. ఇప్పుడు ఉన్న గోశాలలో ఎన్ని కోడెలు ఉన్నాయని ఆరా తీశారు. వాటి సంరక్షణ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ, గుడి చెరువు బండ్ పార్క్ పనులపై సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాస్ రాజ్ కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేసి వివరించారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ సీఈ రాజేశ్వర్, ఎస్.ఈ రాములు ఈఈ నరసింహాచారి, ఆలయ ఈవో రమాదేవి, ఈఈ రాజేష్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.






