సీఎం పర్యటనపై సామాన్యుల పెదవి విరుపు.. (వీడియో)

by S Gopi |   (  Updated:2023-04-01 17:54:56  IST  )

గతంలో రెండు సార్లు వాయిదా పడి ఎట్టకేలకు జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్ పర్యటన పట్ల సామాన్యుల స్పందన...Public Response Over Cm KCR Visit

సీఎం పర్యటనపై సామాన్యుల పెదవి విరుపు.. (వీడియో)
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: గతంలో రెండు సార్లు వాయిదా పడి ఎట్టకేలకు జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్ పర్యటన పట్ల సామాన్యుల స్పందన అంతంత మాత్రంగానే ఉంది. కలెక్టరేట్ నుండి బహిరంగ సభకు బైపాస్ రోడ్డు గుండా వెళ్లగా కాన్వాయ్ రావడానికంటే అరగంట ముందు నుండి అక్కడి ప్రజలను ఆ రోడ్డు మీదుగా వెళ్లకుండా పోలీస్ సిబ్బంది ఆపడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. ఓట్ల సమయంలో ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఇంట్లోకి వచ్చి మరీ మాట్లాడుతారు కానీ, మనం వేసిన ఓట్లతో గెలిచి నేడు మనల్నే ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని ఒక్క రెండు నిమిషాలు ఆగి ప్రజలతో మాట్లాడి పథకాల గురించి ఆరా తీస్తే బాగుండు అని పెన్షన్లు అంటూ మన నుండి నిత్యావసరాల ధరలు పెంచి తిరిగి వాటినే మనకి ఇస్తున్నాడు అని పెదవి విరిచారు. జిల్లా ఏర్పాటుతో మెడికల్ కళాశాల, నూతన కలెక్టరేట్ తప్ప ఒరిగిందేమి లేదని జిల్లా వాసులు మాట్లాడుకుంటున్నారు.

Next Story