ప్రజాపాలన, ప్రభుత్వ పథకాలపై ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించాలి : కలెక్టర్ చిత్రా మిశ్రా

by Nallavelli.Anjaneyulu |

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12న సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్ లకు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమం పై కలెక్టర్ చిత్రా మిశ్రా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు.

ప్రజాపాలన, ప్రభుత్వ పథకాలపై  ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించాలి :   కలెక్టర్ చిత్రా మిశ్రా
X

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12న సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్ లకు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమం పై కలెక్టర్ చిత్రా మిశ్రా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అమలు చేయడంలో ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకమని అన్నారు. నూతనంగా ఎన్నికైన వారు సహా, ప్రతి ఒక్కరికీ ఈ కార్యక్రమాలపై అవగాహన ఉండాలని తెలిపారు. అందువల్ల ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రజలకు లబ్ధి చేకూర్చే వివిధ పథకాలు, కార్యక్రమాలు, వాటి అమలు, లబ్ధి పొందే విధానంపై వివరించాలని అన్నారు.

సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రజా ప్రతినిధుల పాత్ర,పై అవగాహన కల్పించాలన్నారు. 99 రోజుల ప్రజా పాలన కార్యాచరణ గురించి స్పష్టంగా తెలిపాలని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలోని 10 అంశాలు వాటి ప్రాధాన్యతను వివరించాలన్నారు. మహిళల, పిల్లల సంరక్షణ చట్టాలు, హెల్ప్ లైన్ నెంబర్లు, ఇందిరమ్మ ఇళ్లు, వాటి పురోగతి, గృహాలకు అందిస్తున్న ఉచిత విద్యుత్తు, విద్య, వైద్య శాఖల్లో అమలు చేస్తున్న నూతన విధానాలపై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, ఎస్సీ వెల్ఫేర్ డిడి నాగలేశ్వర్, డి వై ఎస్ ఓ శ్రీనివాస్, హౌసింగ్ శాఖ పిడి శ్రీనివాస్ పాల్గొన్నారు.

Next Story