ప్రజా ప్రతినిధులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

by Ratna Kumari |

ప్రజా ప్రతినిధులు చట్టాలపై అవగాహన పెంచుకున్నప్పుడే గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించగలరని మండల పరిషత్ అభివృద్ధి అధికారి రామకృష్ణ అన్నారు. ​

ప్రజా ప్రతినిధులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
X

దిశ, కోరుట్ల రూరల్ : ప్రజా ప్రతినిధులు చట్టాలపై అవగాహన పెంచుకున్నప్పుడే గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించగలరని మండల పరిషత్ అభివృద్ధి అధికారి రామకృష్ణ అన్నారు. ​కోరుట్ల మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు ఐదు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల బలోపేతం, పాలనలో వార్డు సభ్యుల భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. నూతన పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనలు, అధికారాలపై పూర్తిస్థాయి గ్రామ పంచాయతీ అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర వారు నిర్వహించాల్సిన గ్రామ సమస్యల పరిష్కారం, నిధుల వినియోగం, పారిశుధ్యం వంటి అంశాలపై సభ్యుల బాధ్యతలను వివరించారు. ​​ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Next Story