- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామ, వార్డు సభల పేరిట ప్రజాధనం వృథా
జగిత్యాల జిల్లాలో నిర్వహిస్తున్న గ్రామ సభలు, వార్డు సభలు ప్రజలకు ఉపయోగం లేకుండా నామమాత్రంగా జరుగుతున్నాయని మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ విమర్శించారు.

దిశ, జగిత్యాల టౌన్ : జగిత్యాల జిల్లాలో నిర్వహిస్తున్న గ్రామ సభలు, వార్డు సభలు ప్రజలకు ఉపయోగం లేకుండా నామమాత్రంగా జరుగుతున్నాయని మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ విమర్శించారు. శనివారం జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రామ సభలు, వార్డు సభలు ఎవరి కోసం నిర్వహిస్తున్నారో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. గతంలో ప్రజాపాలన పేరుతో తీసుకున్న దరఖాస్తులకు ఇప్పటివరకు పరిష్కారం చూపలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదని, వందరోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారెంటీలు ఇంకా అమలులోకి రాలేదని అన్నారు. గ్రామ సభలు నిర్వహించడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు వెనుకడుగు వేస్తున్నారని, ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారని అన్నారు. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి ఎలాంటి మార్పు తీసుకురాలేదని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి సాధించిందని, ప్రస్తుతం ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. గ్రామ సభలు, వార్డు సభలు పేరుతో ప్రజల దృష్టి మళ్లించి ప్రజాధనం వృథా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అయిల్నేని వెంకటేశ్వర్ రావు, బిఆర్ఎస్ కౌన్సిలర్ లు దేవేందర్ నాయక్, హరీష్,మాజీ పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి ఇతర నాయకులు తదితరులు ఉన్నారు.






