తిప్పాయిపల్లి సర్పంచ్ పై ప్ర‌జావాణిలో ఫిర్యాదు

by Ratna Kumari |

జ‌గిత్యాల జిల్లా కొడిమ్యాల మండ‌లంలోని తిప్పాయిప‌ల్లి స‌ర్పంచ్ ల్యాగ‌ల రాజేశం పై ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు గ్రామ‌స్తులు.

తిప్పాయిపల్లి సర్పంచ్ పై ప్ర‌జావాణిలో ఫిర్యాదు
X

దిశ, జగిత్యాల కలెక్టరేట్ : జ‌గిత్యాల జిల్లా కొడిమ్యాల మండ‌లంలోని తిప్పాయిప‌ల్లి స‌ర్పంచ్ ల్యాగ‌ల రాజేశం పై ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు గ్రామ‌స్తులు. అధికార దుర్వినియోగం చేశార‌ని, ఎలాంటి అనుమ‌తులు లేకుండా గ్రామంలోని చెట్లను నరికి అమ్మి వచ్చిన దాదాపు ₹20,000ను ఎస్టీవో ఖాతాలో జమ చేయకుండా త‌న సొంత అవసరాలకు వాడుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2026 ఏప్రిల్ 2న జరిగిన గ్రామ సభలో సర్పంచ్ స్వయంగా ఈ విషయాన్ని ఒప్పుకున్నారని గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వాలు చెట్ల సంరక్షణకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్న సమయంలో ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన సర్పంచ్ ఇలా వ్యవహరించడం పట్ల గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వార్డు సభ్యులు నరెడ్ల గౌతమ్ రెడ్డి, మ్యాకల మల్లేశం, బొక్కెన అరుణ్ కుమార్, వెంకట్ రెడ్డి, ఆకుల వెంకటేశం కలెక్టర్‌ను కోరారు.

Next Story