- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇంటిని ముట్టడించిన దళితులు
by S Gopi |
దళితబంధు పథకం కింద ఎంపిక కాని దళితులు హుజూరాబాద్ లోని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్... Protest in front of SC Corporation chairman

X
దిశ, దశ హుజూరాబాద్: దళితబంధు పథకం కింద ఎంపిక కాని దళితులు హుజూరాబాద్ లోని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇంటిని ఆదివారం ముట్టడించారు. చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంటి గేటుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గంలోని దళితులందరికి దళిత బంధు రాలేదని అన్నారు. సర్వేలు నిర్వహించిన సమయంలో ఊరిలో లేనివారికి నేటి వరకు దళిత బంధు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజవర్గంలోని దళిత బంధురాని వారందరికి వెంటనే దళిత బంధు పథకం కింద రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు. లేనియెడల ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Next Story






