- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ కుటుంబం ముందు ఆస్తి తగాదాలు పరిష్కరించుకోవాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం అక్రమంగా సంపాదించిన ఆస్తుల పంచాయితీ పరిష్కరించుకున్న తర్వాత ప్రజా ప్రభుత్వం పై విమర్శలు చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు దిగిపోవాలని మంత్రి ప్రశ్నించారు. కేసీఆర్ కూతురు కవితకు పార్టీ పెట్టె అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని మంత్రి అడ్లూరి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతులను ఆదుకోవాలని ఉద్దేశంతో ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని మంత్రి తెలిపారు. మొక్కజొన్న రైతులకు మద్దతు కల్పించాలని మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటాలుకు రూ. 2400 మద్దతు ధర చెల్లిస్తుందని మంత్రి తెలిపారు. మొక్కజొన్న రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకొని రైతులు మద్దతు ధర పొందాలని మంత్రి పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించి చేతులు దులుపుకుంటుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. గత ఖరీఫ్ సీజన్ లో రైతుల వద్ద సేకరించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎఫ్ సీ ఐ ద్వారా వెంటనే సేకరించి యాసంగి ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.
రబీ సీజన్ లో రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. చామనపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఇరిగేషన్ శాఖ ద్వారా సంప్రదింపులు జరిపి కొనుగోలు కేంద్రానికి స్థలం కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హామీ ఇచ్చారు. నూతనంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వద్ద బోరుబావి తవ్వించడంతో పాటు విద్యుత్ సౌకర్యం కల్పిస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. గ్రామంలో అంబేద్కర్ భవనం ఏర్పాటు తోపాటు ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ధర్మారం మండల ప్రభుత్వ అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రుప్లా నాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రంజిత్ యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మండల సర్పంచ్లు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






