న్యాయవాదులు నిత్య విద్యార్థులుగా ఉండాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి

by S Gopi |
న్యాయవాదులు నిత్య విద్యార్థులుగా ఉండాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి
X

దిశ, కరీంనగర్ లీగల్: న్యాయవాదులు నిత్య విద్యార్థులుగా ఉంటూ వృత్తి నైపుణ్యలను పెంపొందించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ కోరారు. బుధవారం కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలోని మీడియేషన్ కేంద్రంలో 2019-22 సంవత్సరాల్లో ఎన్రోల్ చేసుకున్న జూనియర్ న్యాయవాదుల వృత్తి నైపుణ్య శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ న్యాయవాదులు సుప్రీం, హైకోర్టుల నుంచి పలు కేసుల్లో ఎప్పటికప్పుడు వెలువడుతున్న తీర్పులను తెలుసుకోవడం ద్వారా న్యాయవాద వృత్తిలో రాణించే అవకాశం ఉంటుందన్నారు. సీనియర్ న్యాయవాదులు కొరివి వేణుగోపాల్, మిట్టపల్లి అనిల్ కుమార్ లు జూనియర్ న్యాయవాదులకు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకొనే విషయమై దిశా నిర్దేశం చేశారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమను బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎర్రం రాజారెడ్డి, లింగంపెల్లి నాగరాజు ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు అరెల్లి రాములు, సిరికొండ శ్రీధర్ రావు, కొట్టె తిరుపతి, బెజ్జంకి శ్రీకాంత్ సేన, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.





Next Story

Most Viewed