- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైబర్ నేరాల నివారణ.. విద్యార్థులకు అవగాహన తప్పనిసరి
విద్యార్థి దశ నుంచే సైబర్ నేరాల నివారణ పై అవగాహన కలిగి ఉండాలని సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ అన్నారు.

దిశ, జగిత్యాల టౌన్: విద్యార్థి దశ నుంచే సైబర్ నేరాల నివారణ పై అవగాహన కలిగి ఉండాలని సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ అన్నారు. బుధవారం ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు సైబర్ నేరాల నివారణ పై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటరమణ మాట్లాడుతూ.. నేటి డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయని విద్యార్థులకు వివరించారు.
యువత ఎక్కువగా సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమ్స్, బ్యాంకింగ్ యాప్‌లు, డిజిటల్ లావాదేవీలను వినియోగిస్తున్నందున వారిని టార్గెట్ చేస్తూ నేరస్తులు కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఉపాధ్యాయులు సైతం సైబర్ నేరాల నియంత్రణలో తమ వంతు పాత్ర పోషించాలన్నారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నెంబర్ లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ కరుణాకర్ , సైబర్ క్రైమ్ ఎస్ఐ లు కృష్ణ ,దినేష్ కాలేజీ లెక్చరర్స్, స్టూడెంట్స్ పాల్గొన్నారు.






