- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవినీతి నిరూపిస్తే దేనికైనా సిద్ధం : సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్
అవినీతిని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని అసత్య ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని సుల్తానాబాద్ సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ పేర్కొన్నారు.

దిశ, సుల్తానాబాద్ : అవినీతిని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని అసత్య ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని సుల్తానాబాద్ సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం ఆయన సుల్తానాబాద్ సింగిల్ విండో కార్యాలయంలో సభ్యులతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తనపై రాజకీయ కక్షతోనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, సీడ్స్ అమ్మకాల వ్యవహారంలో తనపై బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అవి రాజకీయ కుట్రలో భాగమేనని తెలిపారు. గత 13 సంవత్సరాలుగా రైతు సేవలో కొనసాగుతూ, మచ్చలేని నాయకుడిగా గుర్తింపు పొందానని, రాజకీయంగా ఎదుర్కోలేక తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించకపోతే పరువు నష్టం దావా వేస్తానని, ఇప్పటికే న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సీడ్స్ విక్రయాలకు సహకార సంఘానికి ఎలాంటి సంబంధం లేదని, ఈ వ్యవహారంపై విజిలెన్స్, టాస్క్ ఫోర్స్ అధికారులు విచారణ చేపట్టి తనను నిర్దోషిగా తేల్చారని తెలిపారు.
ఒక రైతు వద్ద సీడ్ విక్రయించి డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. సహకార సంఘాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఆదర్శ సంఘంగా తీర్చిదిద్దామని శ్రీనివాస్ పేర్కొన్నారు. గతంలో రూ.7 కోట్ల స్థాయిలో ఉన్న సంఘాన్ని ప్రస్తుతం రూ.40 కోట్లకు తీసుకువచ్చామని, ఆడిట్‌లో సి గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్ స్థాయికి తీసుకెళ్లామని వివరించారు. సంఘం ప్రస్తుతం రూ.25 లక్షల లాభాల్లో ఉందని, రైతులకు రూ.75 లక్షల వాటాదనము పంపిణీ చేశామని తెలిపారు. రెండు కోట్ల నష్టం జరిగిందన్న ఆరోపణలను కూడా నిరూపించాలని సవాల్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన రూర్బన్ నిధుల వినియోగంలో లోపాలు జరిగాయని ఆరోపిస్తూ, రైతులకు ఉపయోగపడే గోదాములు, షెడ్ల నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. జిల్లాలోని 20 సంఘాల్లో సుల్తానాబాద్ సంఘానికి ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. ఈ సమావేశంలో సంఘ డైరెక్టర్లు కూకట్ల ఓదెలు, సుగుణాకర్, బండ గోపాల్, లచ్చయ్య, కమలమ్మ, గెల్లు పద్మ, సురేష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ దున్నపోతుల రాజయ్య, మహమ్మద్ రఫీక్ పాల్గొన్నారు.






