- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కి పకడ్బంది ఏర్పాట్లు
మే 03న జరుగనున్న నీట్ ఎగ్జామ్ కు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు.

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : మే 03న జరుగనున్న నీట్ ఎగ్జామ్ కు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. చిన్న పొరపాటుకు ఆస్కారం ఇవ్వవద్దని సూచించారు. నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహణ పై మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పలువురు అధికారులు కేంద్రాల చీఫ్ సూపరిండెంట్ల విద్య వైద్య పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ కరీంనగర్ లో ఏడు కేంద్రాల్లో నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ జరుగుతుందని అన్ని సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని తెలిపారు. తాగునీటి వసతితో పాటు టాయిలెట్స్ ఇతర సదుపాయాలు కల్పించాలనీ, ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా పోలీస్ అధికారులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించాలని సూచించారు. సీసీ కెమెరాలు సక్రమంగా పని చేసేలా చూసుకోవాలని అధికారులంతా సమన్వయంతో ఎంట్రెన్స్ ఎగ్జామ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా కృషి చేయాలని పేర్కొన్నారు.
మే 03న మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుందని తెలిపారు. ఆ రోజు 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారని చెప్పారు. విద్యార్థులు ఒరిజినల్ గుర్తింపు కార్డు ఆధార్ కార్డుతో హాజరుకావాలని తెలిపారు. మొబైల్ ఫోన్ తో పాటు ఇతర ఏ వస్తువులకు అనుమతి లేదని పేర్కొన్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంటుందని విద్యార్థులు నియమ నిబంధన కచ్చితంగా పాటించాలని సూచించారు. అన్ని రకాలుగా ఏర్పాట్లు పక్కాగా చూసుకోవాలని విద్యార్థులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తగా వ్యవహరిం చాలని పేర్కొన్నారు. ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్, మహిళా ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, ఆలుగునూరులోని కేంద్రీయ విద్యాలయం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్, కరీంనగర్ ఉజ్వల పార్కు సమీపంలో ఉన్న బాలికల పాలిటెక్నిక్ కళాశాల, చింతకుంట ఎస్సీ రెసిడెన్షియల్ స్కూలు, కేబుల్ బ్రిడ్జి సమీపంలోని మైనార్టీ స్కూల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి టాస్క్ ఫోర్స్ ఏసీపీ వాసాల సతీష్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ పంకజ్ కుమార్, ఆయా కేంద్రాల చీఫ్ సూపరిండెంట్లు విద్య వైద్య శాఖాధికారులు పాల్గొన్నారు.






