- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉధృతంగా వాగు... జేసీబీలో నిండు గర్భిణి తరలింపు
పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు జెసిబి సాయంతో వాగు దాటించిన ఘటన జగిత్యాల

X
దిశ, రాయికల్: పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు జెసిబి సాయంతో వాగు దాటించిన ఘటన జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని వడ్డే లింగాపూర్ గ్రామానికి చెందిన గుగ్లావత్ కళ్యాణి (25) అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు బయలుదేరారు. అయితే గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రామాజీపేట శివారులో బ్రిడ్జి పై నుంచి వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. వాగు దాటే పరిస్థితి లేకపోవడంతో... జెసిబి తీసుకువచ్చారు స్థానిక యువత. అనంతరం జేసీబీలో గర్భిణిని తరలించారు. వాగు గట్టున అప్పటికే అంబులెన్స్ వచ్చి సిద్ధంగా ఉండడంతో కళ్యాణిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
Next Story






