కరీంనగర్ జిల్లాను పథకాల అమలులో అగ్రభాగాన నిలపాలి

by velandi.Saikiran |

కలెక్టరేట్ లో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా స్పెషల్ ఆఫీసర్ అధ్యక్షతన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

కరీంనగర్ జిల్లాను పథకాల అమలులో అగ్రభాగాన నిలపాలి
X

దిశ, కరీంనగర్ కలెక్టరేట్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల అమలులో కరీంనగర్ జిల్లాను అగ్రభాగాన నిలపాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా స్పెషల్ ఆఫీసర్ సందీప్ కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు. బుధవారం నాడు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా స్పెషల్ ఆఫీసర్ సందీప్ కుమార్ సుల్తానియా హైదరాబాద్ నుండి నేరుగా కరీంనగర్ కలెక్టరేట్ కి చేరుకున్నారు . అనంతరం కలెక్టరేట్ లో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా స్పెషల్ ఆఫీసర్ అధ్యక్షతన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలతో మమేకమై వారి సమస్యలను గుర్తించి పరిష్కరించడమే అధికారుల ప్రధాన లక్ష్యంగా ఉండాలని అన్నారు. ప్రజలకు సేవలు అందించడం అధికారుల అదృష్టంగా బావించాలని అన్నారు. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా గుర్తించిన సమస్యల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని అన్నారు.

జిల్లా యంత్రాంగం సమన్వయంతొ పని చేయాలని సమస్యల పరిష్కారం ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగాలని అని అన్నారు , రాష్ట్ర ప్రభుత్వం అనేక వినూత్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని, ప్రజలకు పాలనను చేరువ చేసేందుకే ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తెలిపారు.ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు విజయవంతం చేయడమే కాకుండా , అధికారులు పథకాల సద్వినియోగం పై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రా స్థాయి లో ప్రభుత్వ పథకాల అమలు పై నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి కూడా ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికను కరీంనగర్ జిల్లాలో విజయవంతంగా నిర్వహించిన జిల్లా యంత్రాంగాన్ని ఆయన అభినందించారు.

జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 10 ప్రధాన అంశాలపై జిల్లాలో కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. పరిశుభ్రత, ఫైళ్ల పరిష్కారంలో భాగంగా 4,290 ఫైళ్లు పరిష్కరించగా, 3,835 దరఖాస్తులు స్వీకరించామని, అరైవ్–అలైవ్ కార్యక్రమంలో 318 గ్రామపంచాయతీల్లో రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు . వ్యవసాయ రంగంలో 1.93 లక్షల మంది రైతులకు రూ.143.35 కోట్లు రైతు భరోసా, 206 రైతు కుటుంబాలకు రూ.14 కోట్ల రైతు బీమా అందించగా, 319 కొనుగోలు కేంద్రాల ద్వారా మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.554 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది అని అన్నారు . సంక్షేమ పథకాల కింద 45,920 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయగా, 96,775 కొత్త సభ్యుల పేర్లు చేయడం జరిగింది అని అన్నారు .

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రూ.334 కోట్ల ప్రయోజనం, గృహజ్యోతి ద్వారా రూ.153.10 కోట్ల లబ్ధి కల్పించామని , ఇందిరమ్మ ఇండ్ల పథకంలో 10,209 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, 7,220 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి అని అన్నారు. మెగా జాబ్ మేళాలో 292 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయాని, ప్రజావాణి ద్వారా వచ్చిన 2,995 దరఖాస్తుల్లో 2,144 దరఖాస్తులు పరిష్కరించినట్లు కలెక్టర్ వివరించారు. బడిబాట కార్యక్రమం ద్వారా 9435 మంది ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను చేర్పించడం జరిగింది అని అన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో జిల్లాలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక విజయవంతమైందని, కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ పవర్ ప్రజెంటేషన్ విశేషంగా ఆకట్టుకుంది.పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం , నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తో పాటు ఆయా శాఖల అధికారులు తమ తమ శాఖలకు సంబంధించి 99 రోజుల కార్యక్రమం పై ప్రజెంటేషన్ ఇచ్చారు.

Next Story