కరీంనగర్ లో పోలీసుల స్పెషల్ డ్రైవ్

by Nallavelli.Anjaneyulu |

దిశ బ్యూరో కరీంనగర్ : క‌రీంన‌గ‌ర్ పోలీసులు స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా వాహనాలకు నెంబ‌రు లేకుండా ట్రాఫిక్ నిబంధ‌నలను ఉల్లంఘిస్తున్నారా..?

కరీంనగర్ లో పోలీసుల స్పెషల్ డ్రైవ్
X

దిశ బ్యూరో కరీంనగర్ : క‌రీంన‌గ‌ర్ పోలీసులు స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా వాహనాలకు నెంబ‌రు లేకుండా ట్రాఫిక్ నిబంధ‌నలను ఉల్లంఘిస్తున్నారా..? సులువుగా తప్పించుకునేందుకు వాహనాల నంబర్ ప్లేట్ తోలగించి తిరుగుతున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త. ఇక పై అలా నెంబరు లేని వాహనాలపై తిరిగితే కటకటాల్లోకి వెళ్లాల్సిందే అంటున్నారు కరీంనగర్ పోలీసులు. ఇవాళ‌ కరీంనగర్ టూటౌన్ ట్రాఫిక్ పోలీసుల ఆద్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. నగరంలో నంబర్ ప్లేట్ లేకుండా ట్రాపిక్ నిబందనలను ఉల్లంఘిస్తున్న వాహనాలను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇకపై నగరంలో నెంబరు ప్లేట్ లేకుండా వాహనాలు తిరిగితే పోలీసు చర్యలు తప్పవంటు హెచ్చరిస్తున్నారు.

Next Story