వ్యభిచార గృహంపై పోలీసుల మెరుపు దాడి

by velandi.Saikiran |

హుజురాబాద్ పట్టణంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార కేంద్రంపై పోలీసులు మెరుపు దాడి చేశారు.

వ్యభిచార గృహంపై పోలీసుల మెరుపు దాడి
X

దిశ,​ హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ పట్టణంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార కేంద్రంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. స్థానిక ప్రతాపవాడ ప్రాంతంలో గత కొంతకాలంగా ఓ మహిళ ఇల్లాలు ముసుగులో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోందన్న పక్కా సమాచారం పోలీసులకు అందింది. దీంతో బుధ‌వారం హఠాత్తుగా దాడులు నిర్వహించారు. వ్యభిచార కేంద్రాన్ని నడుపుతున్న మహిళతో పాటు, అక్కడ పట్టుబడిన ఒక విటుడిపై కేసులు నమోదు చేసినట్లు హుజురాబాద్ టౌన్ సిఐ టి. కరుణాకర్ తెలిపారు. పట్టణంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారిపైన అయినా కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Next Story