- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేకాట స్థావరం పై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్
పేకాట స్థావరం పై పోలీసులు దాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నగదు ను స్వాధీనం చేసుకున్న సంఘటన మండల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, గంగాధర : పేకాట స్థావరం పై పోలీసులు దాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నగదు ను స్వాధీనం చేసుకున్న సంఘటన మండల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గంగాధర మండలం మధురానగర్ గ్రామంలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మంగపేట గ్రామానికి చెందిన మల్యాల కొమురయ్య, మహమ్మద్ జాకీర్ హుస్సేన్, బైరీ కార్తీక్ రెడ్డి, మల్యాల నర్సయ్యతో పాటు మధురానగర్‌కు చెందిన కుంచాల ఏడుకొండలు, ముద్రకోల తిరుపతి గా గుర్తించినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి పేకాట ముక్కలు, రూ.15,590 నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు, జూదం వంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై వంశీకృష్ణ హెచ్చరించారు.






