పెళ్లి రోజున అవయవదాన ప్రతిజ్ఞ..!

by Nallavelli.Anjaneyulu |

పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని ఖాజిపల్లి-ప్రగతినగర్‌కు చెందిన యువ దంపతులు కావలి ప్రియాంక, నరేష్ తమ వివాహ వార్షికోత్సవాన్ని సమాజహితంతో గుర్తుండిపోయేలా చేసుకున్నారు.

పెళ్లి రోజున  అవయవదాన ప్రతిజ్ఞ..!
X

దిశ, గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఖాజిపల్లి-ప్రగతినగర్‌కు చెందిన యువ దంపతులు కావలి ప్రియాంక, నరేష్ తమ వివాహ వార్షికోత్సవాన్ని సమాజహితంతో గుర్తుండిపోయేలా చేసుకున్నారు. సోమవారం తమ పెళ్లిరోజు సందర్భంగా మరణానంతరం నేత్రదానం, అవయవదానం చేయాలని ప్రతిజ్ఞ చేసి ఆదర్శంగా నిలిచారు. ఫోటో స్టూడియో నిర్వాహకులుగా ఉన్న ఈ దంపతులు అవయవదానం కోసం అంగీకార పత్రాలపై సంతకం చేశారు. దంపతుల నుంచి ఆ పత్రాలను లయన్స్ క్లబ్ 320జి రీజన్–IX, జోన్–II ఐ విజన్ కోఆర్డినేటర్ లయన్ కోదాటి ప్రవీణ్, లయన్స్ క్లబ్ ఆఫ్ జ్యోతినగర్ ప్రగతి సెక్రటరీ లయన్ దొండపాటి మహేందర్ రెడ్డి స్వీకరించి, సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రచార కార్యదర్శి, ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత కె.ఎస్. వాసుకు అందజేశారు. ప్రేమ వివాహం చేసుకుని ఆదర్శవంతంగా జీవిస్తున్న ఈ జంట తమ వివాహ వార్షికోత్సవం రోజున సమాజానికి మేలు చేసే నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దంపతులను శాలువాతో సత్కరించి అభినందించారు. అలాగే వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 320జి రీజన్–IX, జోన్–II జోన్ చైర్‌పర్సన్ లయన్ నార్ల ప్రసాద్, ఫౌండేషన్ బాధ్యులు టి. శ్రవణ్ కుమార్, లింగమూర్తి, చంద్రమౌళి, వాసు పాల్గొన్నారు.

Next Story