గృహ అవసరాలకు ఉపయోగపడే మొక్కలు పెంచాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

by Ratna Kumari |

గృహ అవసరాలకు సైతం ఉపయోగపడే మొక్కలను నర్సరీల్లో పెంచాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

గృహ అవసరాలకు  ఉపయోగపడే మొక్కలు పెంచాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : గృహ అవసరాలకు సైతం ఉపయోగపడే మొక్కలను నర్సరీల్లో పెంచాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని సాయి నగర్, జే పీ నగర్ లో సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీలను కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పలు నర్సరీల్లో ఎన్ని రకాలు, ఎన్ని మొక్కలు పెంచుతున్నారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. నర్సరీ మొత్తం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలోని నర్సరీలో రోడ్ల వెంట, అలాగే ఇతర చోట్ల నాటే మొక్కలతో పాటుగా గృహ వినియోగానికి ఉపయోగపడే మొక్కలు సైతం పెంచాలని సూచించారు. మునగ, పండ్ల, ఇతర రకాల మొక్కలను నర్సరీల్లో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఎండాకాలం నేపథ్యంలో మొక్కలకు నీటిని పడుతూ సంరక్షించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రణాళిక ప్రకారం మొక్కలను సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, ఆర్డిఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Next Story