- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలిసి పని చేద్దాం.. పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం : చైర్మన్ మల్లయ్య
అందరి సహకారంతో పెద్దపల్లి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తామని మున్సిపల్‌చైర్మన్ నూగిళ్ళ మల్లయ్య అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే విజయ రమణారావు సమక్షంలో చైర్మన్ గా బాధ్యతలను స్వీకరించారు.

దిశ,పెద్దపల్లి : అందరి సహకారంతో పెద్దపల్లి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తామని మున్సిపల్‌చైర్మన్ నూగిళ్ళ మల్లయ్య అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే విజయ రమణారావు సమక్షంలో చైర్మన్ గా బాధ్యతలను స్వీకరించారు. ముందుగా చైర్మన్ చాంబర్‌లో వేదపండితుల సమక్షంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం చైర్మన్, వైస్‌చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం, నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ నూగిళ్ళ మల్లయ్య, శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు సమక్షంలో తన పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపి, చైర్మన్, పాలకవర్గం కలిసికట్టుగా పని చేసి అభివృద్ధికి కృషి చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ళ మల్లయ్య మాట్లాడుతూ పట్టణ ప్రజలు ఆదరించి ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
బాధ్యతలను అప్పగించిన విజన్నకు రుణపడి ఉంటామన్నారు. ఎమ్మెల్యే సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ పట్టణంలో సామాన్య రైతు కుటుంబంలో పుట్టి పెరిగాను. ఇక్కడి రోడ్ల మీద నడిచాను, కంచెర బావి నీళ్లు తాగి పెరిగినవాడినని, ఇక్కడి సమస్యలను దగ్గరగా చూశానన్నారు. అందుకే ఈ పదవిని 'అధికారం'గా కాకుండా, సేవ చేసే అవకాశంగా భావిస్తున్నానని తెలిపారు. పట్టణంలో ఇంకా చాలా మెరుగుపరచాల్సిన అంశాలు ఉన్నాయని వాటి అన్నిటిని అందరి సహకారంతో పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి శుభ్రమైన తాగునీరు, మంచి డ్రైనేజీ వ్యవస్థ, పక్కాగా తడి, పొడి చెత్త అమలు, రోడ్లు, వీధుల దీపాలు, పార్కుల అభివృద్ధి, మెరుగైన ఆరోగ్యం, విద్యా సౌకర్యాలు, యువతకు ఉపాధి అవకాశాలు, స్వచ్ఛతకు పెద్దపీట వేస్తా అన్నారు. ప్రజల నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయనని, పారదర్శకంగా, నిజాయితీగా, పక్షపాతం లేకుండా అందరికీ సమానంగా పనిచేస్తానని మాట ఇస్తున్నానని తెలిపారు. బాధ్యతలను స్వీకరించిన చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్‌ను తోటి కౌన్సిలర్లు, అధికారులు సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, పట్టణ నాయకులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.






