పెళ్లి పత్రికపై దేశ భక్తి సందేశం.. అందర్నీ ఆకట్టుకుంటున్న వినూత్న ఆహ్వానం

by Bhanu |

సాధారణంగా పెళ్లి ఆహ్వాన పత్రికలు సంప్రదాయ శైలిలో ఉంటాయి. అయితే రామడుగు మండల కేంద్రానికి చెందిన డబుల్ కార్ లక్ష్మీబాయి–రాజు దంపతులు మాత్రం తమ కుమారుడు ప్రశాంత్ వివాహ ఆహ్వాన పత్రికను ప్రత్యేకంగా రూపొందించి అందర్నీ ఆకట్టుకుంటున్నారు.

పెళ్లి పత్రికపై దేశ భక్తి సందేశం.. అందర్నీ ఆకట్టుకుంటున్న వినూత్న ఆహ్వానం
X

దిశ, రామడుగు: సాధారణంగా పెళ్లి ఆహ్వాన పత్రికలు సంప్రదాయ శైలిలో ఉంటాయి. అయితే రామడుగు మండల కేంద్రానికి చెందిన డబుల్ కార్ లక్ష్మీబాయి–రాజు దంపతులు మాత్రం తమ కుమారుడు ప్రశాంత్ వివాహ ఆహ్వాన పత్రికను ప్రత్యేకంగా రూపొందించి అందర్నీ ఆకట్టుకుంటున్నారు.

ప్రశాంత్, తిరుమల వివాహం జూన్ 4న మందమర్రి సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో జరగనుంది. ఈ సందర్భంగా పంపిన ఆహ్వాన పత్రికపై భరతమాత చిత్రంతోపాటు "దేశ రక్ష సమం పుణ్యం, దేశ రక్ష సమం వ్రతం, దేశ రక్ష సమం యోగో దృష్టో నైవచ నైవచ" అనే సందేశాన్ని ముద్రించారు.

దేశ రక్షణను ఓ మహా పుణ్య కార్యంగా వివరిస్తూ, ఆ దేశ సేవే యోగం అని చెబుతున్న ఈ ఆహ్వాన పత్రిక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పెళ్లి ఆహ్వాన పత్రిక అందుకున్నవారు దేశభక్తిని నూతనంగా వ్యక్తపరచిన కుటుంబాన్ని ప్రశంసిస్తున్నారు. దేశం పట్ల గౌరవం చూపిన ఈ వినూత్న ఆలోచనకు నెటిజన్ల నుంచి కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story