- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఏఎస్ పిల్లల బకాయిలు విడుదల చేయండి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వం

దిశ, తిమ్మాపూర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి భారీగా తరలివచ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా రావాల్సిన బకాయిలు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో తమ పిల్లలను పాఠశాలలకు రానివ్వడం లేదని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా భారీ ఎత్తున పేరెంట్స్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి రావడంతో, ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలోని పోలీసులు అక్కడికి చేరుకొని వారితో చర్చించారు. కాగా పేరెంట్స్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను కలిసి వినతి పత్రం సమర్పించారు.






