భార‌తీయ మెడిక‌ల్ అండ్ సేల్స్ రిప్ర‌జెంటేటివ్ యూనియ‌న్ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ప‌ప్పుల సురేష్ నియామ‌కం

by Ratna Kumari |

భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధ సంఘమైన భారతీయ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ (BMSRU) రాష్ట్ర అధ్యక్షుడిగా BMS నాయకులు పప్పుల సురేష్ నియమితులయ్యారు.

భార‌తీయ మెడిక‌ల్ అండ్ సేల్స్ రిప్ర‌జెంటేటివ్ యూనియ‌న్ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ప‌ప్పుల సురేష్ నియామ‌కం
X

దిశ‌, క‌రీంన‌గ‌ర్ క‌లెక్ట‌రేట్ : భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధ సంఘమైన భారతీయ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ (BMSRU) రాష్ట్ర అధ్యక్షుడిగా BMS నాయకులు పప్పుల సురేష్ నియమితులయ్యారు. కార్మిక ఉద్యమంలో ఆయనకున్న అనుభవం, అంకితభావం,గుర్తిస్తూ సంఘం రాష్ట్ర సంఘటన కార్యదర్శి రామ్మోహన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూర్పు రాంరెడ్డి కి ఈ కీలక బాధ్యతలను అప్పగించారు. మెడికల్ రిప్రజెంటేటివ్‌లు,సేల్స్ రిప్రజెంటేటివ్‌లు మరియు ఫార్మా రంగ ఉద్యోగులు నేడు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.పెరుగుతున్న పని భారం, ఉద్యోగ భద్రత లేకపోవడం, లక్ష్యాల పేరుతో మానసిక ఒత్తిళ్లు, కార్మిక చట్టాల అమలులో లోపాలు వంటి అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఉద్యమాన్ని నిర్మించేందుకు పప్పుల సురేష్ కృషి చేయనున్నట్లు తెలిపారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఉద్యోగుల హక్కుల పరిరక్షణే నా ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలోని ప్రతి మెడికల్ సేల్స్ ఉద్యోగికి BMSRU అండగా నిలుస్తుంది. సంఘటిత శక్తితో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి, వారి గౌరవప్రదమైన జీవనానికి అవసరమైన హక్కులను సాధించేందుకు నిరంతరం పోరాడుతాము” అని పేర్కొన్నారు. పప్పుల సురేష్ నియామకంపై రాష్ట్ర వ్యాప్తంగా BMS నాయకులు, కార్మిక సంఘ ప్రతినిధులు, మెడికల్ సేల్స్ రంగ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వంలో BMSRU మరింత బలోపేతమై ఉద్యోగుల సంక్షేమం కోసం సమర్థవంతంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన BMS రాష్ట్ర అధ్యక్షులు కలాల్ శ్రీనివాస్ కి, రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

Next Story