పంచాయతీ సొమ్ము ఫలహారం..!

by Ratna Kumari |   (  Updated:2026-02-18 12:07:16  IST  )

ప్రభుత్వ ఆస్తులను, వస్తువులను కాపాడాల్సిన పంచాయతీ అధికారులు, ప్రజా ప్రతినిధులు వాటిని యదేచ్చగా అమ్ముకొని సొమ్ము చేసుకున్న సంఘటన మండలం లో చోటుచేసుకుంది.

పంచాయతీ  సొమ్ము ఫలహారం..!
X

దిశ, శంకరపట్నం : ప్రభుత్వ ఆస్తులను, వస్తువులను కాపాడాల్సిన పంచాయతీ అధికారులు, ప్రజా ప్రతినిధులు వాటిని యదేచ్చగా అమ్ముకొని సొమ్ము చేసుకున్న సంఘటన మండలం లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామంలో గ్రామపంచాయతీకి సంబంధించిన పాడైపోయిన బోరు మోటార్లు, ఇనుప స్క్రాప్ ను పాలక వర్గం అమ్ముకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పరిస్థితి చేయి దాటిపోయిందని గ్రహించిన పంచాయతీ కార్యదర్శి గుట్టు చప్పుడు కాకుండా అమ్మిన వస్తువులను తిరిగి గ్రామ పంచాయతీకి తీసుకు రావడం కోస మెరుపు. గ్రామపంచాయతీకి సంబంధించిన స్క్రాప్ ను అమ్ముకునేందుకు పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేశారని.. ఈనెల 16న అదే గ్రామంలో దాదాపు 13 క్వింటాళ్ల ఇనుప స్క్రాప్ ను 39వేల రూపాయలకు విక్రయించారు. పాలకవర్గంలోని మరో వార్డు సభ్యరాలు పంచాయతీకి సంబంధించిన స్క్రాప్ ను పాలక వర్గం ఇష్టానుసారంగా అమ్ముకున్నారని ఎంపీడీవోకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వ‌చ్చింది. పాలకవర్గం తీర్మాణం మేరకే స్క్రాప్ ను విక్రయించినట్లు పంచాయతీ కార్యదర్శి హైమ తెలిపింది. పంచాయతీ పాలకవర్గం తీర్మాణాన్ని జిల్లా పంచాయితీ అధికారికి సమర్పించిన తర్వాత టెండర్ ప్రక్రియ ద్వారా స్క్రాప్ విక్రయించాల్సి ఉంటుందని కార్యదర్శికి ఈ విషయం తెలియకపోవడం తో విక్రయం జరిగినట్లు ఎంపీడీఓ కృష్ణప్రసాద్ తెలిపారు.

Next Story