మా ఖర్చు మీదే..! నూతన సర్పంచులకు ఎస్​హెచ్​వో ట్విస్ట్​

by velandi.Saikiran |

పంచాయతీ ఎన్నికల్లో లక్షలు ఖర్చు చేసి అష్టకష్టాలు పడి గెలిచిన సర్పంచ్ అభ్యర్థులకు కరీంనగర్ జిల్లాలో ని ఓ పోలీస్ స్టేషన్ లో పనిచేసే ఎస్ హెచ్ వో ఇచ్చిన ఆఫర్ కంగుతినేలా చేసింది.

మా ఖర్చు మీదే..! నూతన సర్పంచులకు ఎస్​హెచ్​వో ట్విస్ట్​
X

మా ఖర్చు మీదే..!

నూతన సర్పంచులకు

ఎస్​హెచ్​వో ట్విస్ట్​

ఎన్నికల ఖర్చు భరించాలంటూ

పోలీసు అధికారి హుకుం

మారిన ఖాకీల మామూళ్ల దందా

ఎన్నికల ఖర్చుగా గ్రామానికి

రూ.15 వేలు అంటూ ఆర్డర్

పోలీస్ అధికారి ఆదేశంతో ఖంగుతిన్న సర్పంచ్ లు

సందిగ్ధంలో పడిన గ్రామపాలకులు

దిశ, కరీంనగర్ బ్యూరో : పంచాయతీ ఎన్నికల్లో లక్షలు ఖర్చు చేసి అష్టకష్టాలు పడి గెలిచిన సర్పంచ్ అభ్యర్థులకు కరీంనగర్ జిల్లాలో ని ఓ పోలీస్ స్టేషన్ లో పనిచేసే ఎస్ హెచ్ వో ఇచ్చిన ఆఫర్ కంగుతినేలా చేసింది. సర్పంచ్ లతో ముఖాముఖీ పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానం చేస్తే పవర్ అంటే ఇలా ఉంటుందా అంటు సంబరపడ్డ సర్పంచ్ లకు సదరు పోలీస్ అధికారి ఇచ్చిన ట్విస్ట్ సవాల్ గా మారింది. ఎన్నికల ఖర్చు అంటే ఎవరికి వారు గెలిచేందుకు పెట్టేది మాత్రమే కాదు ఎన్నికల బందోబస్తు కోసం తమ స్టేషన్ పరిధిలో అయిన ఖర్చు అంతా తమ బాధ్యతే అంటూ ఎన్నికల ఖర్చుకు కొత్త నిర్వచనం చెప్పారు సదరు పోలీస్ అధికారి. అసలే కొత్తగా పవర్ లోకి వచ్చాం ఇవ్వం అంటే ఎక్కడ నామూష్ గా ఉంటుందో అంటు మదనపడుతున్న సర్పంచ్ లకు ఇప్పటికే లక్షలు వెచ్చించి సర్పంచ్ లుగా గెలుపొందాం. ఇంకా చేతికి పూర్తిస్థాయిలో పవర్స్ కూడా రాలే డబ్బులు ఎక్కడినుంచి తేవాలి అంటూ తమ బాధను జనంలో వెల్లగక్కడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారి పోలీసు శాఖలో కలవరం రేపుతుంది

పోలీస్ శాఖ ఎన్నికల ఖర్చు సర్పంచ్ లదే

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని తూర్పు సబ్ డివిజన్ ప్రత్యేక కేటగిరి నియోజకవర్గం లో పనిచేసే ఓ ఎస్ఐ ఎన్నికల ఖర్చు కు కొత్త నిర్వచనం చెప్పడం పోలీస్ శాఖలో కలవరం రేపుతుంది. కొత్త గా గెలిచిన సర్పంచ్ లకు పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానం చేసి సదరు ఎస్ఐ వారిముందు ఎన్నికల ఖర్చు మీ బాధ్యతే అంటూ అందుకు గెలిచిన ప్రతి సర్పంచ్ తమ వంతుగా రూ.15 వేలు భరించాలి అంటూ ఆర్డర్ వేయడం ఆ సర్పంచ్ లకు కొత్త సవాల్ గా మారింది. కొత్తగా సర్పంచ్ బాధ్యతలు చేపట్టాం కాదు కుదరదు అంటే ఎక్కడ చులకన అవుతామో అని మదనపడుతున్న సర్పంచ్ లు జనంలో చెప్పుకుంటే తమ పరువుపోతుంది అంటూ వాఖ్యనించడం ఇప్పుడు అక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది. ఇప్పటికే పక్క మండలంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో ప్రత్యేక టీం ను ఏర్పాటు చేసుకుని సెటిల్ మెంట్లకు పాల్పడుతున్నాడు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు ఎస్ఐ తో సర్పంచ్ లకు తలనొప్పిగా మారిందని చర్చించుకుంటున్నారు.

తన రూటే సఫరేట్

బలమైన సామాజిక వర్గానికి చెందిన సదరు ఎస్ ఐ తన రూటే సఫరేట్ అన్నట్టుగా వ్యవహరించడం పోలీసు శాఖలో కలకలం రేపుతుంది. గతంలో తన సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి ప్రేమ వ్యవహారంలో తలదూర్చి అమ్మాయి మేజర్ అయినప్పటికీ అబ్బాయి బలహీన వర్గానికి చెందిన వాడుకావడంతో అమ్మాయి తరపు బంధువులతో ఒప్పందం కుదుర్చుకుని ఇబ్బందులకు గురిచేశారని సదరు అమ్మాయి ఆరోపించడం సదరు అధికారి వ్యవహర శైలికి అద్దం పడుతుండగా మామూళ్ల వసూళ్ల విషయంలో సైతం ప్రత్యేకతను చాటుకోవడం ఆయన ప్రత్యేకత.

మామూళ్ల కోసం వైన్స్ లో కౌంటర్

ఎన్నికల ఖర్చుకు కొత్త నిర్వచనం చెబుతూ చర్చల్లోకి ఎక్కుతున్న పోలీసు అధికారి మాముళ్లు వసూల్ చేయడంలో సైతం కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. మామూళ్లు వసూల్ చేయడానికి ఎవరికి చిక్కకుండా ఉండేందుకు వైన్స్ షాపులను ఎంచుకుని పక్క మండలాల్లోని తన స్నేహితుల వైన్స్ షాపుల్లో ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేసి మామూళ్లు వసూల్ చేయడం తన ప్రత్యేకతకు నిదర్శనం. గతంలో పనిచేసి పోలీస్ స్టేషన్ లో సైతం పలు వసూళ్ల ఆరోపణలను ఎదుర్కొన్న సదరు అధికారి ఇప్పుడు ఆ సబ్ డివిజన్ లో వసూళ్ల రాయుడు అని జనం చర్చించుకుంటున్నారు. పైగా తన పై అధికారి పేరుమీద కూడ మామూళ్లు వసూల్ చేయడంతో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టు పోలీసు శాఖలో చర్చజరుగుతుంది. తన పోలీస్ స్టేషన్ లో పనిచేసే తన సామాజిక వర్గానికి చెందిన ఓ సినిమా టైటిల్ ను పోలిన పేరుతో ఉన్న సిబ్బందిని ప్రత్యేకంగా వసూళ్లకు నియమించి వసూళ్లకు పాల్పడుతున్నారు అనే విమర్శలు ఉన్నాయి

Next Story